Jallikattu: తమిళనాడులో జల్లికట్లు ప్రారంభం… బరిలోకి 600కి పైగా

తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు (jallikattu) క్రీడలు మొదలయ్యాయి. తమిళనాడు(Tamil Nadu) లో పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. పరుగెత్తే పశువులను పట్టుకుని నిలువరించేందుకు యువకులు ప్రయత్నిస్తారు. అలాగే గ్రౌండ్‌లో ఎద్దులను లొంగదీసుకుని వాటిపై ఆధిపత్యం చెలాయించేందుకు పోటీపడతారు. తాజాగా పుదుక్కోట్టై జిల్లాలో జల్లికట్టు క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తచ్చన్‌కురిచి (Tatchankurichi) లో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్(Dindigul) , మనప్పరై, పుదుక్కోట్లై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి. సుమారు 300 మందికి పైగా యువకులు ఎద్దులను నిలువరించేందుకు పోటీపడ్డారు.