అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం …రూ.25 కోట్ల జరిమానా

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారులపై కూడా ఆ నిషేధం వర్తించనున్నది. కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. అనిల్ అంబానీపై 25 కోట్ల ఫైన్ కూడా వేసింది సెబీ. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ పోస్టు నుంచి కూడా ఆయన్ను తప్పించారు. సెబీ మొత్తం 222 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీ నుంచి ఫండ్స్ ను దారి మళ్లించినట్లు అనిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అనిల్ అంబానీ వత్తిడి వల్ల కీలక మేనేజ్మెంట్ పదవుల్లో ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.