ఎస్బీఐ గుడ్ న్యూస్…వాట్సాప్ ద్వారా
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన వినియోగదారులకు వాట్సాప్ ద్వారా సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్లతో వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ సర్వీస్ పొందాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతలో రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్ నెంబర్ను మాత్రమే ఇందు కోసం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నుంచి ముందుగా డబ్ల్యూఏఆర్ఈజీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఖాతా నెంబర్ ఎంటర్ చేసి బ్యాంక్ ఇచ్చిన నెంబర్కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తరువాత సేవలు పొందవచ్చు.






