Sankranti Celebrations :కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు.. హాజరైన మోదీ, స్పీకర్ ఓం బిర్లా

ఢిల్లీ లోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) నివాసంలో సంక్రాంతి వేడుకలు(Sankranti celebrations) ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ వేడుకల్లో స్పీకర్ ఓం బిర్లా (Om Birla), కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు, సినీనటుడు చిరంజీవి (Chiranjeevi), ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పీవీ సింధు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలను మోదీ వీక్షించారు. గాయని సునీత పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వెంకటేశ్వరస్వామి ప్రతిమను కిషన్‌రెడ్డి అందజేశారు.