President Murmu: మణిపూర్ హింస బాధితులకు అండగా ఉంటాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అల్లర్ల మంటల్లో చిక్కుకున్న మణిపూర్లో శాంతి స్థాపనే ధ్యేయంగా కేంద్రం అడుగులు వేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) చెప్పారు. హింసాత్మక ఘటనల తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించిన ఆమె.. ఇంఫాల్ వేదికగా మణిపూర్ ప్రజలకు భరోసానిచ్చారు. “హింస తర్వాత మణిపూర్ ప్రజలు అనుభవించిన నరకం, వారి వేదన నాకు తెలుసు. మీ ఆందోళనలను పరిష్కరించడానికే మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది,” అని ఆమె (President Murmu) స్పష్టంచేశారు. హింసతో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో వారికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తిరిగి సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లోయ ప్రాంత ప్రజలు ఐక్యమత్యంతో ఉండాలని, శాంతిని కాపాడాలని ఆమె (President Murmu) పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి పనులకు కూడా రాష్ట్రపతి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రగతి కోసం సుమారు రూ. 1,180 కోట్ల విలువైన 14 కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాగా, మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇక్కడ రాష్ట్రపతి (President Murmu) పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే.






