Messi: అభిమానం సల్లగుండ… మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచకప్ విజేత లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో ఆయనకు అభిమానుల నుండి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) టూర్లో భాగంగా మెస్సీ ఇవాళ తెల్లవారుజామున కోల్‌కతాలో అడుగుపెట్టారు. అర్ధరాత్రి సమయం అయినప్పటికీ, వేలాది మంది అభిమానులు మెస్సీని చూసేందుకు విమానాశ్రయానికి తరలివచ్చారు. ఈ బృందంలో ఓ నూతన వధువు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తన ప్లకార్డుపై, తనకు గత శుక్రవారమే పెళ్లయినా, మెస్సీని చూడటం కోసం తన హనీమూన్‌ను క్యాన్సల్ చేసుకున్నట్లు రాసింది. తాను 2010 నుంచీ మెస్సీకి వీరాభిమానినని, అందుకే భర్తతో మాట్లాడి మరీ హనీమూన్‌ను వాయిదా వేసుకున్నట్లు ఆమె తెలిపింది. 2011లో మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడినప్పుడు చూసే అవకాశం దొరకలేదని, ఈసారి ఆ ఛాన్స్‌ను వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన హైదరాబాద్ వస్తుండటంతో, అభిమానులు ఆయనను చూసేందుకు అభిమానులు తెగ ఎగబడుతున్నారు.






