Pawan Kalyan: పవన్ వ్యాఖ్యతో చెలరేగిన వివాదం: తెలంగాణ..ఏపీ లో ట్రోలింగ్ రాజకీయాల హాల్ చల్
ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ఒక వ్యాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ చర్చకు దారి తీసింది. ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr. B.R. Ambedkar Konaseema District) పర్యటన సందర్భంగా కొబ్బరి తోటలను పరిశీలించారు. ఉప్పు నీటి ప్రభావంతో పంటలు నాశనం కావడం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, కోనసీమ అందాలను గుర్తు చేస్తూ “తెలంగాణ దిష్టి తగిలిందేమో” అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆ మాటలు బయటకు వచ్చిన తర్వాత నాలుగు రోజులకే తెలంగాణ రాజకీయాల్లో ప్రతిస్పందనలు మొదలయ్యాయి.
ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి (Anirudh Reddy) పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ (Hyderabad)లో ఆస్తులు సంపాదించి తెలంగాణపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో అడ్డుకుంటామని, విడుదలను నిలిపేస్తామని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సినీ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఇప్పుడు పరిస్థితి తలక్రిందులైంది. అదే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని జనసేన (Jana Sena Party) అనుచరులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సొంత గ్రామంలో సర్పంచ్‌ను గెలిపించుకోలేకపోయిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఆపుతాడని ప్రశ్నిస్తూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయ విమర్శల నుంచి సోషల్ మీడియా యుద్ధంగా మారింది.
తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు ఈ ట్రోలింగ్‌కు నేపథ్యంగా మారాయి. ఈ నెల 11న పోలింగ్, ఫలితాల ప్రకటన జరిగింది. ఎక్కువ పంచాయతీలను అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) దక్కించుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ (Bharat Rashtra Samiti) కూడా కొంతవరకు పట్టు నిలుపుకుంది. బీజేపీ (BJP) మాత్రం ఆ రెండింటితో పోలిస్తే వెనుకబడింది. ఈ ఎన్నికల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగాయగూడ (Rangayaguda)లో బీజేపీ అభ్యర్థి గెలవడం విశేషంగా మారింది. అప్పటి నుంచే ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి.
ఈ ట్రోల్స్ వెనుక ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రతి రాజకీయ పార్టీకి ఇప్పుడు బలమైన సోషల్ మీడియా బృందం ఉంది. ప్రత్యర్థుల బలహీనతలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపడంలో అవి చురుకుగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ చేసిన “దిష్టి” వ్యాఖ్య వెనుక పెద్ద రాజకీయ అర్థాలున్నాయా? లేదా అది సహజంగా వచ్చిన మాటేనా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ కొందరు తెలంగాణ నేతలు కోనసీమలాంటి అందమైన ప్రాంతాలు తమ రాష్ట్రంలో లేవని వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంతోనే పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారని ఆయన అభిమానులు చెబుతున్నారు. కానీ దీనిపై ముందుగా బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి (Jagadishwar Reddy) స్పందించారు. ఆ తర్వాత అనిరుద్ రెడ్డి, అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణ వాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ స్పందనలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పుడు వైరల్ అవుతున్న ట్రోల్స్ పవన్ అభిమానుల పనేనా? లేక తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థులైన బీఆర్ఎస్ శ్రేణుల వ్యూహమా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఒక వ్యాఖ్య నుంచి మొదలైన ఈ వివాదం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.






