కమలా హ్యారిస్‌కు మద్దతుగా… తమిళనాడులో

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను అధ్యక్షుడు జో బైడెన్ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూర్వీకులకు చెందిన తమిళనాడులోని గ్రామంలో పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరువరూర్ జిల్లాలోని తులసేంద్రపురంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. కమలా హ్యారిస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పోస్టర్‌లో రాశారు. తాజాగా నిర్వహించిన సర్వేలో డొనాల్డ్ ట్రంప్‌పై రెండు శాతం తేడాతో కమలా హ్యారిస్ లీడ్‌లో ఉన్నట్లు తెలిసింది.