India : పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

పోరుగుదేశం పాకిస్థాన్ కు భారత్ (India) మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశం గా పాకిస్థాన్ (Pakistan) ను అభివర్ణించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఈ క్రమంలో జెనీవా (Geneva) వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 58వ సమావేశంలో భారత్‌పై పాకిస్థాన్ తీవ్ర విమర్శలు చేసింది. జమ్ము కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్ (Azam Nazir Tarar ) ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిరచింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది.