సరికొత్త S1 X+ డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు దేశవ్యాప్తంగా S1 X+ డెలివరీలను ప్రారంభించింది. ఇటీవలే పరిచయం చేయబడిన S1 X+ ఇప్పుడు ప్రముఖ ICE స్కూటర్ ధరతో సమానంగా కేవలం INR 89,999 వద్ద INR 20,000 ఫ్లాట్ క్యాష్ పరిమిత సమయ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఉన్నతమైన Gen 2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన S1 X+ ప్రముఖ ICE స్కూటర్‌కు సమానమైన ధరను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యుత్తమ పెర్ఫార్మన్స్, అధునాతన సాంకేతికతతో కూడా ఫీచర్లు మరియు అద్భుతమైన రైడ్ నాణ్యతను అందిస్తుంది. ఈ స్కూటర్ 3kWh బ్యాటరీతో వస్తుంది మరియు 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ని అందిస్తుంది. సమర్థమైన 6kW మోటార్‌తో, S1 X+ కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది మరియు 90 kmph గరిష్ట వేగాన్ని తాకుతుంది.
కంపెనీ ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌లో భాగంగా, ఓలా ఈరోజు కమ్యూనిటీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. కమ్యూనిటీ సభ్యులు అన్ని స్కూటర్లపై ఎక్స్టెండెడ్ వారంటీపై 50% తగ్గింపును పొందవచ్చు మరియు ప్రతి విజయవంతమైన సిఫార్సుపై INR 2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. S1 ప్రో జెన్-2 లేదా S1 ఎయిర్ కొనుగోలుపై రిఫరీ INR 3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
ఓలా ఇటీవల తన S1 పోర్ట్‌ఫోలియోను ఐదు స్కూటర్లకు విస్తరించింది. S1 Pro (2వ తరం), కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ స్కూటర్, INR 1,47,499 వద్ద అందుబాటులో ఉండగా S1 ఎయిర్ INR 1,19,999 వద్ద అందుబాటులో ఉంది. అదనంగా, ICE-కిల్లర్ స్కూటర్ గా S1Xని మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది – S1 X+, S1 X (3kWh), మరియు S1 X (2kWh). S1 X (3kWh) మరియు S1 X (2kWh) కోసం రిజర్వేషన్ విండో INR 999 తో ఇప్పటికే తెరవబడింది. S1 X (3kWh) మరియు S1 X (2kWh) స్కూటర్లు INR 99,999 మరియు INR 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి.






