Kambhampati Haribabu :ఒడిశా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం

ఒడిశా 27వ గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు (Kambhampati Haribabu) ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ (Justice Chakradhari Sharan Singh )ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మారీ (Mohan Charan Maria) ప్రతిపక్ష నేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik), పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.