NEET UG : నీట్ యూజీ-2025పై కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షలు నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్(Pen) -పేపర్ (paper) పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖ మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్ (ORM) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయిచినట్లు తెలిపింది.
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎమ్‌ఎస్) నిర్ణయం ప్రకారం నీట్ యూజీ పరీక్ష పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహిస్తాం. ఒకేరోజు, ఒకే షిప్టులో ఈ పరీక్ష ఉంటుంది అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారి వెల్లడిరచారు.