ISRO :ఇస్రో చైర్మన్ గా నారాయణన్ బాధ్యతల స్వీకరణ

ఇస్రో నూతన చైర్మన్‌గా వి.నారాయణన్ (Narayanan )బాధ్యతలు స్వీకరించారు. నారాయణన్‌ను అంతరిక్షశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ (Jitendra Singh) అభినందించారు. రానున్న రోజుల్లో కీలకమైన అంతరిక్ష మిషన్లకు నాయకత్వం వహించాల్సిన నారాయణన్, ప్రధాని మోదీ (Prime Minister Modi )దార్శనికతను సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఇస్రో చైర్మన్ పదవికి ముందు నారాయణన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ)కు డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన తన కెరీర్‌లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ( ఏఎస్‌ఐ) నుంచి స్వర్ణం పతకం, హెచ్‌ఈఎంఎస్‌ఐ టీమ్ అవార్డు, తదితర 26కు పైగా అవార్డులు సాధించారు. అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఐఏఎఫ్) ప్రొపల్షన్ కమిటీ, అంతర్జాతీయ ఖగోళశాస్త్ర అకాడమీ, ఇండియన్ సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ సైన్స్ మొదలైన వాటిల్లో సభ్యులుగా ఉన్నారు.