అది తప్పుడు నిర్ణయమే : నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీని స్థాపించిన నారాయణ మూర్తి ఇప్పటికీ ఒక విషయంలో పశ్చాత్తాపడుతున్నారు. తన భార్య సుధా మూర్తిని, కొడుకు రోహన్ మూర్తిని కూడా వ్యాపారంలో చేర్చుకోకపోవడం సరైంది కాదని ఆయన భావిస్తున్నారు. నారాయణమూర్తి తన కుటుంబాన్ని ఇన్ఫోసిస్‌కు దూరంగా ఉంచేవారు. ఆయన దీనిని తప్పుడు ఆదర్శవాదం అని పిలిచాడు. సుధా మూర్తి చాలా అర్హతలు కలిగి ఉన్నారు. ఆమె ఇన్ఫోసిస్‌లో మొదటి పెట్టుబడిదారు కూడా అని తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో నారాయణమూర్తి తన కుటుంబం గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని వ్యాపారానికి దూరంగా ఉంచాలనే ఆదర్శం తనకు ఎప్పుడూ ఉంచేదని చెప్పారు. కుమారుడు రోహన్ మూర్తి కూడా అదే బాటలో ఉన్నారని తెలిపారు. వ్యాపారంలో కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయడం కూడా ఆయనకు ఇష్టం లేదు. అయితే అది తప్పుడు నిర్ణయమని ఇప్పుడు ఆయన అభిప్రాయపడ్డారు.