Delhi: గుకేశ్, మనుబాకర్ సహా నలుగురికి ఖేల్ రత్న.. అవార్డుల ప్రకటన

అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న(Khel Ratna) అవార్డుకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అనూహ్యంగా షూటర్ మనుబాకర్(Manu bhakar)ను ఖేల్‌రత్న అవార్డు వరించింది. మనుబాకర్‌తో పాటు నలుగురికి ఖేల్‌రత్న అవార్డులకు ఎంపిక చేసింది. వరల్డ్ ఛెస్ ఛాంపియన్ గుకేశ్(gukesh), హాకీ ప్లేయర్ హర్మన్‌ప్రీత్‌సింగ్(harmanpreeth), ప్రవీణ్‌కుమార్(Praveen kumar) కూడా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యారు.
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మనుబాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు లభించింది. తొలుత ఖేల్‌రత్న నామినేషన్లలో లేని మనుబాకర్ పేరు లేకపోవడంతో తీవ్ర దుమారం రేగింది.దీన్ని సరిదిద్దూతూ. చెస్ ఛాంపియన్ గుకేశ్, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు మనూబాకర్ ను ఖేల్‌రత్న అవార్డుకు కేంద్రం ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో పాటు 32 మందికి అర్జున్ అవార్డు(Arjun awards)లను ప్రకటించింది.
చెస్ ప్లేయర్ డి గుకేష్‌ను కూడా ఖేల్ రత్న అవార్డుతో కేంద్రం సత్కరించనుంది. గత నెల డిసెంబర్ 12న గుకేశ్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచ ఛాంపియన్‌గా గుకేష్ నిలిచి వరల్డ్ రికార్డు సాధించాడు.
హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్‌లకు కూడా ఖేల్ రత్న అవార్డు ఇవ్వనున్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రవీణ్ కుమార్ హైజంప్ టీ64 ఈవెంట్‌లో దేశానికి బంగారు పతకాన్ని అందించాడు. ఆసియా రికార్డును బద్దలు కొట్టి ఈ ఘనత సాధించాడు. క్రీడా మంత్రిత్వ శాఖ 32 మంది అథ్లెట్లను అర్జున అవార్డుతో సత్కరిస్తుంది. వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం.