ఏడాది చిన్నారికి అదృష్టం.. లక్కీ డ్రాలో

ఎస్‍ఎమ్‍ఏ (స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ) వ్యాధి ఇప్పటికే ఆ దంపతులకు ఓ బిడ్డను దూరం చేసింది. ఇప్పుడు ఏడాది వయసున్న కుమార్తె జుహా జైనాబ్ అదే వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం అవసరమయ్యే ఇంజెక్షన్ డోసు కోసం రూ.16 కోట్లు ఖర్చు చేయాలని వైద్యులు తెలిపారు. అంత మొత్తం ఎలా తేవాలని బాధపడుతున్న తల్లిదండ్రులకు లాటరీ రూపంలో అదృష్టం వరించింది. చిన్నారికి ఊపిరిపోసింది. ఎస్‍ఎమ్‍ఏ చికిత్సకు అవసరమైన మందును సరఫరా చేసే యూఎస్‍కు చెందిన టర్బైన్ డ్రగ్ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో ఉచితంగా మందును పొందే అవకాశం దక్కించుకున్న ముగ్గురిలో ఈ దంపతుల గారాలపట్టి ఉంది. ఢిల్లీలోని ఆసుపత్రిలో ఇంజెక్షన్ చేసినట్లు తల్లిదండ్రులు అయేషా, అబ్దుల్లా తెలిపారు.