Brightcom: అమెరికా కంపెనీతో బ్రైట్‌కామ్ ఒప్పందం

ఏఐ ఆధారిత ఏరోస్పేస్ ఇంటెలిజెన్స్, అటానమస్ డిఫెన్స్ టెక్నాలజీల్లో సహకారానికి అమెరికా (America) కు చెందిన క్లోజ్ క్వార్టర్స్ టాక్టికల్ (సీక్యూటీ) వెపన్ సిస్టమ్స్‌తో హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్ (Brightcom) గ్రూప్ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. బ్రైట్‌కామ్ గ్రూప్ ఇటీవలే బ్రైట్‌కామ్ డిఫెన్స్ పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. స్వామ్ కోఆర్డినేషన్, ఇంటెలిజెంట్ థ్రెట్ రెస్పాన్స్, ఆధునిక ఆయుధ వ్యవస్థల ఇంటిగ్రేషన్ తన లక్ష్యంగా ఈ గ్రూప్ ప్రకటించింది. ఇందుకు సాఫ్ట్‌వేర్ (Software) వ్యవస్థలను సమర్థవంతమైన హార్డ్‌వేర్ వ్యవస్థలతో అనుసంధానం చేయడం అవసరమని, సీక్యూటీ వెపన్ సిస్టమ్స్‌తో భాగస్వామ్యం అందుకు దోహదపడుతుందని బ్రైట్‌కామ్ గ్రూప్ చైర్మన్ సురేశ్ రెడ్డి (Suresh Reddy) అన్నారు.