Supreme Court : సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ప్రమాణం

పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ (, Vinod Chandran) కు సుప్రీంకోరు జడ్జి (Supreme Court Judge )గా పదోన్నతి లభించింది. ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఈ నెల 7న కొలీజియం చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Arjun Ram Meghwal) వెల్లడిరచారు. కేరళ హైకోర్టు మాతృకగా ఉన్న జస్టిస్ చంద్రన్ 2023 మార్చి 29న పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతిపై సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి కానున్నారు.