జియో మరో సంచలనం… జూలై 7 నుండి
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్‌ను లాంచ్ చేసింది. జియో 2 జీ ముక్త్ భారత్ విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్‌తో పాటు కొత్త రూ.123 ప్లాన్ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు, 14 జీబీ డేటా (రోజుకు 0.5 జీబీ) అందిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో పేర్కొంది. ఇంకా 2జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కస్లమర్ల కోసం ఇన్`క్లాస్ జియో 4జీ నెట్వర్క్ తొలి 10 లక్షల జియో భారత్ ఫోన్ల బీటా ట్రయల్ జూలై 7 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.






