విప్రోకు ఎదురుదెబ్బ … కార్మిక శాఖకు ఫిర్యాదు
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయం పై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ ఉద్యోగ సంఘం నాసెంట్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ పేర్కొంది. కంపెనీ తన నిర్ణయాన్ని పున పరిశీలించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు ఈ మేరకు విప్రో పై కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. విప్రో ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది. ఇది ఆఫర్ లెటర్ నిబంధనలకు స్పష్టంగా ఉల్లంఘన అని ఫిర్యాదు చేసింది. దీన్ని ఆమోదిస్తే ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల దోపిడీకి ఉద్యోగ భద్రత లోపానికి దారి తీస్తుందని నైట్స్ ఫిర్యాదులో పేర్కొంది. తాజా పరిణామంపై విప్రో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.






