ఇన్ఫోసిస్ కీలక ప్రకటన… ఉద్యోగుల పర్ఫార్మెన్స్ పై
ఈ ఏడాది కాలేజ్ల నుంచి ఫ్రెషర్స్ నియామకాలు ఉండవని చెప్పి టెక్లీలో గుబులు రేపిన దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ పై కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా 80 శాతం వేరియబుల్ పే చెల్లించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ అందరూ అర్హులు కారని పేర్కొంది. కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్-6 కంటే దిగువ స్థాయి ఉద్యోగులకు సగటున 80 శాతం వేరియబుల్ పే అందుకునేందుకు అర్హులని వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ ఈ మెయిల్ పంపించింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, సంస్థలో నిర్వహించిన పాత్రను బోనస్లు ప్రతిబింబిస్తాయని తెలిపింది. ఈ నవంబర్ నెల జీతంతో పాటే వారి అకౌంట్లలో డబ్బులు పడతాయని స్పష్టం చేసింది.






