Indonesia : భారత గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఇండోనేషియా అధ్యక్షుడు

భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో (Prabowo Subianto )ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆహ్వానం మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు రిపబ్లికన్ వేడుకల (Republican celebration )కు హాజరవుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇండియాలో ఇండోనేషియా ప్రెసిడెంట్ జనవరి 25, 26 తేదీల్లో పర్యటించనున్నారు. 2024 అక్టోబర్‌లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారత్‌లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది.