HMPV :భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్.. ఆందోళన అవసరం లేదన్న కేంద్రం

చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో భారత్‌లోనూ ఈ కేసులు వెలుగు చూడటం కలవరపాటుకు గురిచేస్తోంది. దీనిపై స్పష్టతనిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎంపీవీ (HMPV ) ఇప్పటికే వ్యాప్తిలో ఉందని తెలిపింది. మిగతా శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏదని పేర్కొంది. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్ర ఆరోగ్యశాఖ (Union Health Ministry ) స్పష్టం చేసింది.
ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే హెచ్‌ఎంపీవీ ఉంటుంది. సాధారణ జలుబు, ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారుల్లో వృద్ధుల్లో ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది అని కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ (Atul Goyal ) పేర్కొన్నారు. సీజనల్ శ్వాసకోశ సంబంధింత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామగ్రి, పడకలు, ఇతర వసతులతో భారత్(India) లోని ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో అవసరమైన జాగ్రత్తలు వహించడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.