కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా కేంద్రం నిలువరించింది. ఈ మేరకు చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను పెరగకుండా చూడాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ చక్కెర మిల్లులకు, డిస్టిలరీలకు లేఖ రాసింది. చెరకు ప్రధానంగా పండిరచే రాష్ట్రాల్లో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దిగుబడి తగ్గింది. దీంతో చక్కెర ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా చక్కెరను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఇథనాల్ తయారీకి చెరకు రసాన్ని, సుగర్ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది.






