కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. సామాన్యులకు
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన స్మాల్ స్కీమ్ వడ్డీ రేట్లను 10 నుంచి 30 బేసిస్ మేర పెరిగాయి. సవరించిన వడ్డీ రేట్లు ఏడాది, రెండేళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరగ్గా, 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ 30 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఏడాది డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 6.9 శాతం, 2 ఏళ్ల డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లు 7 శాతం, 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ), కిసాన్ వికాస్ పాత్ర, సీనియర్ సిటీజన్ స్కీమ్, సుకన్య సంవృద్ధి యోజన స్కీమ్ మినహా మిగిలిన స్కీమ్‌లు యధావిధిగా కొనసాగుతున్నాయి.






