యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్

ఇటీవల శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ ఉత్పత్తుల కు కూడా కేంద్రం ఇదే తరహాలో హై రిస్క్ అలర్ట్ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్‌లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్ ఇన్ తన అడ్వైజరీలో వెల్లడించింది. యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది అని తెలిపింది.