గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్లు

గూగుల్ కంపెనీ యూజర్లకు ఆకట్టుకునేందుకు ప్రాంతీయ స్థాయిలో అనేక ఫీచర్లను యాడ్ చేయనున్నది. యూజర్ల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్లు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యం రైలులో ప్రయాణించే వారి కోసం ట్రైన్ లైవ్ లొకేషన్ ఫీచర్‌ను యాడ్ చేయనుంది. వాహనదారులకు ఇంధన ఖర్చులను ఆదా చేసే ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ ఫీచర్లను ఇప్పటికే యూరప్, అమెరికా, యూకేలో విజయవంతంగా అందిస్తోంది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ సేవలను అందించనుంది. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా సరే తమ గమ్య స్థానాలకు చేరుకోవాలంటే ఎక్కువగా ఉపయోగించేది గూగుల్ మ్యాప్స్. ఇందులో ఇప్పటి వరకు గమ్యస్థానాల గురించి తెలుసుకోవడం, దానికి ఎంత సమయం పడుతుంది. ఏ మార్గంలో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉంటుంది అనే వివనాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇవన్నీ స్ట్రీట్ వ్యూలా కనిపించేవి. అయితే వీటిలో ఇప్పుడు ప్రాంతీయ సరిహద్దులను కూడా జోడిరచడం విశేషం. 2024లో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే యూజర్లు అందరికీ ఈ ఫీచర్లు అందుబాటులో రానున్నాయని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.