ఎయిర్‌ఇండియాకు షాక్ … 99 లక్షల జరిమానా

ఎయిర్‌ఇండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు గాను ఆ సంస్థకు రూ.90 లక్షల జరిమానా ను విధిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. దీంతోపాటు ఎయిర్‌ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ కు రూ.6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్ కు రూ.3 లక్షలు జరిమానా విధించింది. ఈ లోపాలపై సంస్థ ఇచ్చిన స్వచ్ఛంద నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.