Modi: జిమ్మీ కార్టర్ గొప్ప రాజనీతిజ్ఞుడు : మోదీ

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమీ కార్టర్ (Jimmy Carter )మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని, ప్రపంచ శాంతి, సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. భారత్-అమెరికా (India-America ) ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కార్టర్ సహకారం మరువలేనిదని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యానికి అధిపతిగా తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిమ్మీ కార్టర్ అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 (James E. Carter) తెలిపారు.