Arvind Kejriwal : కేజ్రీవాల్ కు పోటీగా మాజీ ఎంపీ

దేశ రాజధాని ఢల్లీిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించనప్పటికీ రాజకీయ వేడి మాత్రం రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) ఢల్లీి ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) కు పోటీగా మాజీ ఎంపీని బరిలోకి దింపింది. తొలి జాబితాలో 29 స్థానాలకు బీజేపీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. న్యూఢల్లీి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మ (Parveshwarma) పేరును ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి ఆప్ నేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ (Sandeep Dixit) పేరును ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూఢల్లీి నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది.