Mamata Banerjee : భాగవత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : మమతా బెనర్జీ

అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్య్రాన్ని పొందిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat ) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee )స్పందిస్తూ.. ఇది దేశ చరిత్రను వక్రీకరించడానికి ఆర్‌ఎస్‌ఎస్ (RSS)పన్నుతున్న పథకమని విమర్శించారు. భాగవత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అవి భారతదేశ చరిత్రకు వ్యతిరేకమైనవి. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక, అసంబద్దమైన వ్యాఖ్యలతో దేశ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని మతం ఆధారంగా విభజించాలని చూస్తే మేము ఊరుకోము. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.