అయోధ్యలో రిసార్ట్ కు అమెరికా సంస్థ ఒప్పందం

ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్‌మెంట్ అయోధ్యలో 100 గదుల రిసార్ట్ నిర్మాణం కోసం అమెరికన్ సంస్థ అంజలి ఇన్వెస్ట్‌మెంట్ ఎల్‌ఎల్‌సీ ఒప్పందం కుదుర్చుకుంది. అయోధ్యలోని రామ్ లల్లా శంకుస్థాపన కార్యక్రమం తర్వాత రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. ఈ ప్రాంతానికి భక్తులు, పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. పర్యాటకుల సందర్శనను సులభతరం చేయడానికి, వారికి వసతి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన అమెరికన్ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని రమేస్ నంగురానూరి అయోధ్యలో రిసార్ట్ నిర్మించడానికి యూపీ టూరిజం శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు.