టాటా సంచలన నిర్ణయం.. ఎయిరిండియా ఉద్యోగులు ఇక
దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ దాన్ని పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టింది. సంస్థలో శాశ్వత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. శాశ్వత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే సంస్థకు కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు వివిధ విభాగాల్లో నియామాక ప్రక్రియను ప్రారంభించింది. ఎయిరిండియాలో 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకొని 55 ఏళ్లు పైబడిన వారు ఈ వీఆర్ఎస్ను ఎంచుకోవచ్చు. క్యాబిన్ సిబ్బంది అయితే 40 ఏళ్లు పైబడిన వారు వీఆర్ఎస్ మెమోలో ఎయిరిండియా పేర్కొంది. వీఆర్ఎస్ను ఎంచుకున్న వారికి ఎక్స్‌గ్రేషియాతో పాటు అదనంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని దానిలో పేర్కొన్నారు. వీఆర్ఎస్ తీసుకోవాలనుకుంటున్న ఉద్యోగులు జూన్ 1 నుంచి జూన్ 30 మధ్య తమ ప్రాంతీయ అధికారిని సంప్రదించాలని సూచించారు.






