గౌతమ్ అదానీ కీలక ప్రకటన
అదానీ ఎంటర్ప్రైజెస్ సబ్సిడరీ సంస్థ అయిన అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ కీలక ప్రకటన చేసింది. బెంగుళూరుకు చెందిన కమర్షియల్ డ్రోన్ మేకర్ జనరల్ ఎయిరోనాటిక్స్లో 50 శాతం వాటాను దక్కించుకున్నట్టు దీనికి సంబంధించిన డీల్ ప్రక్రియ కూడా పూర్తయినుట్ట వివరించింది. ఈ కంపెనీ తన మిలటరీ డ్రోన్స్, ఏఐ/ ఎంఎల్ సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంది. దేశీయ వ్యవసాయ రంగానికి పరిష్కారాలను అందించడానికి జనరల్ ఏరోనాటిక్స్తో కలిసి పని చేస్తుంది. జనరల్ ఏయిరోనాటిక్స్ అనేది వ్యవసాయ రంగంలోకి కీలకమైన సేవలు అందిస్తుంది. కృత్రిమ మేధస్సు పంట ఆరోగ్యం కచ్చితత్వం, వ్యవసాయం, దిగుబడి పర్యవేక్షణ కోసం రోబోటిక్ డ్రోన్లు, డ్రోన్ అధారిత పరిష్కారాలను అందించే అగ్రి సొల్యూషన్ ప్రొవైడర్. ఇది 2016లో విలీనం చేయబడింది. దేశీయ వ్యవసాయ రంగానికి ఎండ్ టు ఎండ్ పరిష్కారాలను అందించడానికి జనరల్ ఏరో నాటిక్స్తో కలిసి పని చేస్తుందని కంపెనీ తన ఫ్లై లింగ్స్లో తేలిపింది. ఈ డీల్ జులై 31, 2022గా నిర్ణయించినట్టు తెలుస్తున్నది.






