హసీనా దించివేత వెనుక కుట్ర : యూనుస్
బంగ్లాదేశ్‌లో ప్రధాని పదవి నుంచి షేక్ హసీనాను దించేయడం ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రే అని ఆ దేశ తాత్కాలిక సారథి మహ్మద్ యూనుస్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన క్లింటన్ గ్లోబల్ ఇనీషియేటివ్ వార్షిక సమావేశంలో ప్రసంగించారు. విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్‌కు కొత్త రూపు తీసుకొచ్చారని కొనియాడారు. హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు రాలేదు గానీ, మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇదంతా యాదృచ్ఛికం కాదని, ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని అభిప్రాయపడ్డారు.






