Ind vs Eng: జైస్వాల్ చెత్త ఫీల్డింగ్, సెంచరీ చేసాడు, సెంచరీనర్ర పోగొట్టాడు

క్రికెట్ లో క్యాచ్ లకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. క్యాచ్ లే మ్యాచ్ లను గెలిపిస్తాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది భారత్ టి 20 ప్రపంచకప్ గెలిచింది అంటే ఖచ్చితంగా ఓ క్యాచ్ పుణ్యమే. అలాంటి క్యాచ్ ల విషయంలో.. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ లో భారత ఫీల్డర్లు చేసిన తప్పులు మ్యాచ్ కొంప ముంచుతాయేమో అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు వచ్చిన ఆధిక్యం 6 పరుగులు మాత్రమే. కాని ఆరు క్యాచ్ లు పట్టి ఉంటే.. 150 పరుగులకు పైగా ఆధిక్యం వచ్చేది.
ఇంగ్లాండ్ ను 340 పరుగులకే భారత్ ఆల్ అవుట్ చేసే అవకాశం దక్కేది. ఒక్క యశస్వి జైస్వాల్(Jaiswal) 3 క్యాచ్ లు వదిలేసాడు. అది కూడా బూమ్రా బౌలింగ్ లో. బూమ్రా(Jasprit Bumrah) బౌలింగ్ లో మొత్తం 4 క్యాచ్ లు వదిలేసారు. ఒకటి జడేజా వదిలేసాడు. 2019 తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలను చేజార్చుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మొదట బెన్ డకెట్‌ను 15 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ వదిలేసాడు. దీనితో అతను 62 పరుగులు చేసాడు.
60 పరుగుల వద్ద ఓలీ పోప్ క్యాచ్ వదలగా అతను సెంచరీ చేసాడు. 3వ రోజు హ్యారీ బ్రూక్ 83 పరుగులతో ఉండగా.. జైస్వాల్ క్యాచ్ వదిలేసాడు. అతను మరో 16 పరుగులు చేసాడు. భారత్ తమ అవకాశాలను ఉపయోగించుకుని ఉంటే దాదాపు 150 పరుగుల ఆధిక్యం సాధించగలిగేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వ్యాఖ్యానించాడు. తన బౌలింగ్ లో నాలుగు క్యాచ్ లు వదిలేసినా భూమ్రా మాత్రం 5 వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా, డ్రా అయినా దానికి ప్రధాన కారణం జైస్వాల్ మాత్రమే.