మిట్ అండ్ గ్రీట్‌లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. లండన్ పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో కార్యక్రమంలో ఎన్నారైలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన అతి తక్కువ కాలంలో విదేశీ పర్యటనలు చేపట్టిన సీఎం, మంత్రులు రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. ప్రపచంంలోని ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. మూసీ నది ప్రక్షాళన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని నగరాలతో పోటీపడే విధంగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ప్రతినిధులు గంప వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, సుబ్బురు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






