Pezheshkian: యుద్దాన్ని మేము కోరుకోవడం లేదు : పెజెష్కియన్
యుద్దాన్ని మేము కోరుకోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ (Pezheshkian) ప్రకటించారు. పార్లమెంట్ (Parliament) సమావేశాల సందర్బంగా ఆయన మాట్లాడుతు అమెరికా (America ) అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుందని, ఇజ్రాయిల్ (Israel) దురాక్రమన కు మద్దతు తెలుపుతుందన్నారు. మా కమాండర్ లను,శాస్త్రవేత్తలను హత్య చేసిందని,శాస్త్రవేత్తలు ఏ నేరం చేశారని ప్రశ్నించారు. మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, ఇతర అవసరాల కోసం అణు పరిశోధనలు చేసుకునే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. ఇరానీయులందరూ ఐక్యతతో జియోనిస్టు మారణకాండను ఎదుర్కోవాలన్నారు.మేము దురాక్రమణదారులం కాదని.యుద్దాన్ని మేం ప్రారంభించలేదని, ఇరానీయులు శాంతి, సామాజిక న్యాయం,అభివృద్ది కోసం పోరాడతారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ చేసిన దాడిలో 224 మంది ఇరాన పౌరులు చనిపోయారు. మరో 1200 మంది కి పైగా గాయపడ్డారని అదికార వర్గాలు తెలిపాయి.







