ట్రంప్‌దే విజయం.. బేబీ హిప్పో జోస్యం
అమెరికా ఎన్నికల్లో విజేత ఎవరనే అంశంపై ఓ హిప్పో జోస్యం చెప్పింది. థాయ్‌లాండ్‌లోని సి రాచాలోని ఖావో ఖీవ్ ఓపెన్ జూ నిర్వాహకులు ఓ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న ఇంటర్నెట్ సెన్సేషన్ బేబీ హిప్పో మూడెంగ్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని చెప్పింది. పోటీ ఎలా జరిగిందంటే ఓ గుమ్మడికాయను రెండు ముక్కలు చేసి ఓ చోట ఉంచారు. అందులో ఒకదానిపై ట్రంప్ పేరు, మరోదానిపై కమలా హ్యారిస్ పేరు రాశారు. బేబీ హిప్సో ఎవరు పేరున్న గుమ్మడికాయ తింటే వారే అమెరికా అధ్యక్షుడైనట్లు లెక్క. ఈ పోటీల్లో హిప్పో ట్రంప్ పేరున్న గుమ్మడికాయ ముక్కనే కొరికింది.






