Student visa: అమెరికాకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి

అమెరికా విద్యార్థి వీసా (Student visa)ల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని ఆ దేశ ఉన్నతాధికార వర్గాల దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల స్క్రీనింగ్ తదితరాలను అమెరికా కఠినతరం చేయడం తెలిసిందే. దాంతో వీసా అపాయింట్‌మెంట్లు (Visa appointments ) పొందడమే విద్యార్థులకు చాలా కష్టంగా మారిపోయింది. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలతో, ఢల్లీిలోని ఆ దేశ దౌత్య కార్యాలయంతో దీనిపై లోతుగా చర్చించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్‌సింగ్ (Kirtiwardhan Singh) ఈ మేరకు వెల్లడిరచారు. భారత విద్యార్థుల ఆందోళనలను ఎప్పటికప్పుడు అమెరికా (America) దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఆయన వివరించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత సమాధానమిచ్చారు.