Tahawwur Rana : రాణా పిటిషన్‌ను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు

భారత్‌కు అప్పగించొద్దంటూ ముంబై ఉగ్రవాదుల నిందితుడు తహవ్వుర్ రాణా (Tahawwur Rana) వేసిన అత్యవసర పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు (Supreme Court ) తిరస్కరించింది. పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా లాస్ ఏంజెలిస్‌లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ (David Coleman Headley )తో అతనికి సంబంధాలున్నాయి. 26/11 దాడుల కేసులో రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. అతని రివ్యూ పిటిషన్‌ను జనవరిలో ఫెడరల్ కోర్టు (Federal Court) తోసిపుచ్చింది. రాణాను చికిత్స విషయంలో నిర్ణయం తెలిపేందుకు భారత్ నిరాకరించింది. దాంతో భారత్‌కు అప్పగిస్తే బతికనంటూ రాణా పిటిషన్ దాఖలు చేశారు. పాక్ సంతతి ముస్లిం గనుక తనను చిత్రహింసలకు గురి చేస్తారనిన ఆరోపించారు.