ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాదులపై.. అమెరికా దాడులు

ఇరాక్-సిరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న తీవ్రవాద గ్రూపులపై అమెరికా సైన్యం వైమానికదాడులకు పాల్పడింది. ఇరాక్‍లో ఉన్న తమ సైనికులపై ఈ గ్రూపులు డ్రోన్ తదితర దాడులకు ఈ ప్రాంతాలు ఉపయోగించుకుంటున్నారని, అందువల్లే వారిపై చర్యకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. సదరు ప్రాంతంలో ఇరాన్ మద్దతున్న ఇరాకీ తీవ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని తెలిపింది. తమ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన అమెరికా దాడులను ఇరాన్ సైన్యం తీవ్రంగా ఖండించింది. మరోవైపు, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని సాయుధ తీవ్రవాద గ్రూపులు హెచ్చరించాయి.