White House: F-1 వీసా వ్యవధి గరిష్టంగా నాలుగేళ్లే.. కొత్త నిబంధనలు విడుదల చేసిన అమెరికా…
మీరు అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారా…? అక్కడ చదువుకుని డాలర్ డ్రీమ్స్ మునిగి తేలుదామనుకుంటున్నారా..? అయితే విద్యార్థులు మీరు …. ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే.
విదేశీ విద్యార్థుల చదువుకు సంబంధించి బైడన్ హయాం నాటి నిబంధనలను సవరించి కొత్త నిబంధనలు విడుదల చేసింది ట్రంప్ (Trump) సర్కార్..
F-1 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాఠశాలలో చేరిన ఏడాది లోపు విశ్వవిద్యాలయాలను బదిలీ చేసుకోవడానికి అర్హులు కారు. అంటే విద్యార్థులు వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయాలను మార్చుకోలేరు. 1 సంవత్సరం కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే విద్యార్థి విశ్వవిద్యాలయాన్ని మార్చగలడు.
F-1 విద్యార్థులు బయటకు వెళ్లి కొత్త వీసా పొందకుండా …ఒకే స్థాయిలో విద్యలో బహుళ మాస్టర్స్ లేదా బహుళ డిగ్రీలు చేయడానికి అర్హులు కాదు. అలాగే విద్యార్థుల OPT సమయం తర్వాత 60 రోజులకు బదులుగా 30 రోజుల వరకూ మాత్రమే అనుమతిస్తారు.అంటే గతంలోలా 60 రోజులకు బదులు 30 రోజులు మాత్రమే అమెరికా గడ్డపై ఉండేందుకు వీలుంది.F-1 మాస్టర్ విద్యార్థులు వీసాకు హాజరవుతున్నప్పుడు చూపించిన I-20 కాకుండా..ప్రోగ్రామ్ మార్పులు లేదా విశ్వవిద్యాలయం మార్చేందుకు అర్హులు కారు.
F-1 వీసా వ్యవధి గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే. ఆ తర్వాత 4 సంవత్సరాలు ప్రతి F-1 దేశం విడిచి వెళ్లి F-1లో కొనసాగడానికి మళ్ళీ స్టాంప్ వేయించుకోవాలి.. F-1 వీసాను 1 సంవత్సరం నుండి గరిష్టంగా 4 సంవత్సరాల వరకు ఇవ్వవచ్చు మరియు బస వ్యవధి (D/S) స్థానంలో ఇవ్వవచ్చు. ఆ నాలుగేళ్లలోపు ఏవైనా పొడిగింపులను USCIS అలాగే వీసా స్టాంపింగ్ ద్వారా చేయవచ్చు
BS—>MS —>PhD కొనసాగింపుకు 4 సంవత్సరాల వ్యవధి తర్వాత వీసా స్టాంపింగ్ అవసరం. రాబోయే 30-60 రోజుల్లోపు ఈవిధానం అమల్లోకి వస్తుంది. దీన్ని వందశాతం కచ్చితంగా అమలు చేయనుంది ట్రంప్ సర్కార్.







