అమెరికాలో పెట్టుబడులు పెట్టిన వారికి.. ఈబీ5 వీసా
అమెరికాలో వాణిజ్యం, వ్యవసాయం, రియల్ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఎంప్లాయిమెంట్ బేస్డ్ వీసాల సౌకర్యం ఉంటుందని అమెరికన్ అటార్నీ అబ్దుల్ ఆరిఫ్ తెలిపారు. వీఎస్సీ క్యాపిటల్ ఆధ్వర్యంలో టీ హబ్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికాలో పెట్టుబడులు, వీసా తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టిన వారికి, కుటుంబ సభ్యులకు ఈబీ5 వీసా సౌకర్యం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడి దారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీఎస్పీ క్యాపిటల్ నిర్వాహకులు, పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.






