అమెరికాలో విషాదకర ఘటన
అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దంపతులు గొడవ పడుతూ పరస్పరం దాడి చేసుకొని ప్రాణాలు కోల్పోగా, పక్క గదిలో వీడియో గేమ్ ఆడుతున్న వారి 11 ఏళ్ల కుమారుడు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. హాలోవీన్ వేడుకల సందర్భంగా గత నెల 31వ తేదీన వాషింగ్టన్లోని లాంగ్వ్యూలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. చివరకు రక్తపు మడుగులో ఉన్న తల్లిదండ్రులను చూసిన బాలుడు 911కి ఎమర్జెన్సీ కాల్ చేసి విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాల సమీపంలో కత్తితో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే దంపతులిద్దరూ గొడవకు దిగి ఒకరినొకరు దాడి చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన భార్యభర్తలను జువాన్ ఆంటోనియో అల్వరాడో (38), సిసిలియా రోబుల్స్ (39)గా గుర్తించారు. వీరి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడిరచారు.






