Birth rate : అమెరికాలో భారీగా పడిపోయిన జననాల రేటు

అమెరికాలో సంతానోత్పత్తి దారుణంగా పడిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంత తక్కువగా గత ఏడాది జననాల రేటు (Birth rate) నమోదైది. 2024కు సంబంధించి వ్యాధి నియంత్రణ, నివారణ సెంటర్లు (సీడీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో సంతానోత్పత్తి తగ్గిపోయిన విషయం స్పష్టమైంది. జనాభా భర్తీ రేటు ప్రకారం సగటున ప్రతి మహిళ (Woman)కు 2.1 కంటే ఎక్కువగా పిల్లలు (Children) ఉండాల్సిన తరుణంలో.. అమెరికాలో జననాల రేటు 1.6 కంటే తక్కువగా నమోదైందని సీడీసీ (CDC) వెల్లడించింది. 1960ల్లో అమెరికాలో జననాల రేటు సుమారు 3.5గా ఉంది. ఆ తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. జననాల రేటు తగ్గిపోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం సంతానోత్పత్తిని పెంచడానికి ఇటీవల చర్యలు చేపట్టింది.