Zelensky: రష్యాతో ప్రత్యక్ష చర్చలకు సిద్ధం : జెలెన్స్కీ
రష్యా అధినేత పుతిన్ (Putin)తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) ప్రకటించారు. ఇస్తాంబుల్ (Istanbul) వేదికగా చర్చలకు పుతిన్ ఆహ్వానాన్ని నేరుగా ఆయన ప్రస్తావించలేదు. కానీ, ఎట్టకేలకు రష్యా (Russia) యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోంది అని పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పులు విరమణే అని పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదు. రష్యా కాల్పులు విరమణ ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నాం. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ (Ukraine) సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారు.







