ట్రంప్ విజయం తర్వాత తొలిసారిగా.. హౌతీలపై
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత తొలి సారిగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆయుధ డిపోలే లక్ష్యంగా అగ్రరాజ్యం యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో హౌతీలకు భారీ నష్టం వాటిల్లింది. కనీసం మూడు చోట్ల అత్యాధునిక ఆయుధ డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా అధికారులు తెలిపారు. మరోవైపు గాజా, లెబానాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. జబాలియాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 33 మంది చనిపోయారు. లెబాన్లోని అల్మాత్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 23 మంది చనిపోయారు.






