అమెరికాకు ఇదో మంచి అవకాశం … ఇరాన్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ గెలవడంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మునుపటి తప్పులను సమీక్షించుకునేందుకు అమెరికాకు ఇదో అవకాశంగా పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి పేర్కొన్నారు. గతంలో అమెరికా ప్రభుత్వ విధానాలతో తమకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయని ఎస్మాయిల్ వెల్లడించారు. ఈ సందర్భంగా మునుపటి తప్పుడు విధానాలను సమీక్షించడానికి ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.






