ఎలాన్ మస్క్‌ను దాటేసిన ట్రంప్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్స్‌కు ఉన్న విలువను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన సోషల్ మీడియా ట్రూత్ అధిగమించింది. సోషల్ మీడియా ఎక్స్ కంటే ట్రంప్ ట్రూత్ మీడియా విలువైనదిగా రికార్డ్ సృష్టించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన ట్రూత్ సోషల్ మీడియా షేర్లు దూసుకుపోతున్నట్లుగా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఫిడిలిటీ వెల్లడిరచింది. ప్రస్తుతం ఎక్స్‌కు 9.4 బిలియన్ డాలర్ల (రూ.79వేల కోట్లు) విలువ ఉండగా, ట్రంప్ ట్రూత్ 10 బిలియన్ డాలర్ల (రూ.84 వేల కోట్లు)తో ముందుస్థానంలో ఉందని సమాచారం.






